Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'డాక్టర్ మోహన్ బాబు రూరల్ హెల్త్ స్కీమ్' ఫ్రారంభించిన మంచు విష్ణు

'డాక్టర్ మోహన్ బాబు రూరల్ హెల్త్ స్కీమ్' ను మంచు విష్ణు తిరుపతిలో ప్రారంభించారు. గ్రామాల్లో శిశు మరణాలను తగ్గించడం, గర్భిణులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, రకరకాల వ్యాధుల ప్రభావం నుండి గ్రామవాసులను కాపాడటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ స్కూల్ కు చెందిన సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం అయిన 'ఆర్మీ గ్రీన్' విద్యార్థులు చంద్రగిరి మండలం లోని ఐదు గ్రామాలను ఈ స్కీమ్ కోసం దత్తత తీసుకున్నారు. ఈ స్కీమ్ వల్ల ఐదు గ్రామాల ప్రజలకు అనేక వైద్య ప్రయోజనాలు కలగనున్నాయి. గ్రామస్థులకు వివిధ వైద్య పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు అవసరమైన మందులు కూడా అందచేస్తారు. ఒక్కో గ్రామస్థుడి మీద సుమారు 4 నుంచి 5 లక్షలు వరకు ఖర్చు పెట్టనున్నారు. మెరుగైన ఆరోగ్యం... ఆరోగ్యకరమైన జీవితం అనే స్లోగన్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంచు విష్ణు అన్నారు. ప్రస్తుతానికి ఐదు గ్రామాలకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేశామని... వచ్చే ఏడాది ఆఖరు కల్లా చంద్రగిరి మండలంలోని అన్ని గ్రామాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని ఆయన వెల్లడించారు.

More Telugu News